ఆత్మకూరు పట్టణంలో ఓ  రైస్ మిల్లు పై స్థానిక ఎస్ఐ లు రవి నాయక్ సంతోష్ రెడ్డి  తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 140 రేషన్ బియ్యం బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  రెండు ఆటోలు.. సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు... గత కొంతకాలంగా ఆత్మకూరులో రేషన్ బిల్లు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది .. దీంతో పోలీసులు నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నారు