కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు సేవాభావం ఉట్టిపడేలా వినూత్న రీతిలో
నెల్లూరు, నవంబర్ 10 :  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు సేవాభావం ఉట్టిపడేలా వినూత్న రీతిలో జరిగాయి. గురువారం ఉదయం నెల్లూరు డైకస్ రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయానికి  జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు మంత్రికి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  తన జన్మదినం సందర్భంగా ఎలాంటి ఆర్భాటాలు చేయొద్దని, విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఇచ్చిన పిలుపునకు అనూహ్యస్పందన లభించింది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన  పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పుస్తకాలు  దుప్పట్లు, స్వెట్టర్లు, బ్యాగులు, జామెంట్రీ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, ఆటవస్తులు తదితర విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మంత్రి కాకాణి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన పిలుపుమేరకు అభిమానులు  అందజేసిన స్వెట్టర్లను, దుప్పట్లను విద్యార్థులకు అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంతకాలం తాను జరుపుకున్న జన్మదినాలు ఒక ఎత్తని, ఈ జన్మదినం తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మంత్రి జన్మదినం సందర్భంగా జిల్లా అంతటా  దేవాలయాల్లో,  మసీదుల్లో,  చర్చిలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.  పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, వృద్ధాశ్రమాల్లో దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. 
 ముందుగా భారీ కేక్ ను కట్ చేసిన మంత్రి, తన జన్మదిన వేడుకలను పేదలు, విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు
  
  
  
  
  
  
  
  
  
  
  
.jpeg)
  
  
  
  
  
  
  
  


