విద్యార్థులకు బహుమతులు అందజేసిన పి డి ఎస్ యు విద్యార్థి సంఘం.

సూళ్లూరుపేట మార్చి 10 (రవి కిరణాలు):-

   ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి. డి. ఎస్. యు) ఆధ్వర్యంలో మార్చి 8 వ తేదీన జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ డిగ్రీ కళాశాల, విక్రం కాలేజీ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు ఎస్సే రైటింగ్,  క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటేషన్లో గెలుపొందినటువంటి విద్యార్థినిలకు శుక్రవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా"ఏస్.ఎల్.బి. శంకర్ శర్మ చేతుల మీదుగా   బహుమతులను అందజేశారు. ఎస్సే రైటింగ్ లో ఉష, రోజా, ఆసిఫా, యామిని, స్లామ, నిఖిత క్విజ్ లో జోషిత,నాగమణి,మిత్ర, బహుమతులను గెలుపొందారు. సుమారుగా 100 మంది విద్యార్థినులతో పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం  నాయకులు సమావేశం ఏర్పాటు చేసి దేశంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను విద్యార్థినిలకు  తెలియపరిచి పురుషునితో సమానంగా స్త్రీలకు కూడా సమానమైన హక్కులను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని  లేకపోతే ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా మన హక్కులు సాధించే విధంగా మనం  పోరాటం చేయాలని కూడా విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా" ఏస్. ఎల్ బి శంకర్ శర్మ , లెక్చరర్స్  సునీత, యామిని, మరియు పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు, సునీల్, లోకేష్. పి.డి.ఎస్.యు సూళ్లూరుపేట మండల అధ్యక్షులు వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు శివ శంకర్, విద్యార్థినిలు పాల్గొన్నారు.