ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ 
సూళ్లూరుపేట మార్చి 13, రవి కిరణాలు:-
సూళ్లూరుపేట పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన 
పోలింగ్ కేంద్రం లో పట్టభద్రుల,టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా ముగిసింది , ఆర్డిఓ చంద్రముని పర్యవేక్షణలో తహశీల్దార్ రవికుమార్ అద్వర్యం లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ సిబ్బంది సహకారం తో  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని తిరుపతి ఏఎస్పి విమల కుమారి, నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ ఓటర్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా సిఐ తో పాటు సూళ్లూరుపేట ఎస్సై పి. రవిబాబు, గుణశేఖర్, ఏఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికలు నియోజకవర్గంలో అన్నిచోట్ల
ప్రశాంతంగా జరుగుతున్నాయని, పోలింగ్ ఏర్పాట్లు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
సూళ్లూరుపేట మండలము  మొత్తంపట్టభద్రులు:3360
పోల్ అయిన ఓట్లు: 2364 
 
పర్సంటేజ్.            70.35%
టీచర్స్ మొత్తం ఓట్లు.  251
పోల్ అయిన ఓట్లు.    239
 
పర్సంటేజ్.                95.22%
..............................
తడ మండలం
పట్టభద్రులు        1040
పోల్ అయిన ఓట్లు. 835
పర్సంటేజ్.    80.288%
టీచర్స్.  20
పోల్ అయిన ఓట్లు 20
పర్సంటేజ్.  100%
.................................
దొరవారిశత్రం మండలం
మొత్తం  పట్టభద్రులు   . 832
పోల్ అయిన ఓట్లు.  595
పర్సంటేజ్.   71.5%
మొత్తం  టీచర్స్ ఓట్లు .  25
పోల్ అయిన ఓట్లు .  24
పర్సంటేజ్.    99%



.jpeg)