జగనన్న వసతి దీవెన పేరుతో ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను దగా చేసారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో చదివే విద్యార్థులకు ఇస్తున్న పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకానికి జగనన్న వసతి దీవెన అని పేరు మార్చి తనేదో కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారని,వాస్తవానికి గత ప్రభుత్వం లో కంటే విద్యార్థులను తగ్గించి వారిని దగా చేసారని,తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఈ రాష్ట్రంలో SC,ST,BC,మైనారిటీ విద్యార్థులకు మాత్రమే పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలను ఇస్తుండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటి సారిగా కాపు, ఈ బి సి విద్యార్థులకు కూడా పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలను ఇచ్చారని,2018-19 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం17,03,091మంది విద్యార్థులకు,రూ 3813 కోట్లు ఉపకారవేతనాలు ఇవ్వగా ఈ సంవత్సరం జగనన్న విద్యా దీవెన క్రింద 2300 కోట్ల తో 11,84,000 మందికి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని,గత సంవత్సరం కంటే వైసీపీ ప్రభుత్వం 5,19,091 మంది విద్యార్థులను తగ్గించింది, రూ.1513 కోట్లు తగ్గించి విద్యార్థులను దగా చేసిందని,అదేవిధంగా గతంలో ఈ పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలను ప్రతినెల విద్యార్థుల బాంక్ ఖాతాలో జమ చేసేవారని,అయితే నేడు సంవత్సరానికి రెండే దపాలు ఇస్తామని చూపుతున్నారని,విద్యా సంవత్సరం జులై లో మొదలై ఏప్రిల్,మే నెలలో ముగుస్తుందని,ఈ సంవత్సరం మొదటి విడత మార్చి నెలలో ఇచ్చి రెండవ విడత ఆగస్టు నెలలో ఇస్తామని చూపుతున్నారని,విద్యా సంవత్సరం ఏప్రిల్ తో పూర్తి అవుతుంటే రెండో విడత ఆగష్టు నెలలో ఎలా ఇస్తారో ఎవ్వరికీ అర్ధం కావడము లేదని,అమలులో ఉన్న పథకాలకు పేరు మార్చి గతంలో కంటే విద్యార్థులు సంఖ్య తగ్గించి విద్యార్థులకు అన్యాయం చేసి తామేదో విద్యార్థులను ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని,ఇప్పటికయినా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం లో ఇచ్చినట్లుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన విద్యార్థులు అందరికి వసతి దీవెన ను వర్తింప చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, కావలి ఓంకార్,శివుని రమణారెడ్డి,కలికి సత్యనారాయణ రెడ్డి,ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, పడవల ఆదిశేషయ్య, పూల వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు