కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, రవికిరణాలు సెప్టెంబర్ 30 :
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. నగరంలోని కలెక్టరేట్ కు వచ్చిన ఎంపీ.. కలెక్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. కలెక్టర్ తో భేటీ అయ్యి జిల్లా అభివృద్ధిపై చర్చించారు. జిల్లా సమస్యలను, చేపట్టాల్సిన అంశాలు, పెండింగ్ విషయాలపై మాట్లాడారు. కలెక్టర్ ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


