జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం 




 సైదాపురం మండలం మేజర్ న్యూస్ :- 

 సైదాపురం మండల కేంద్రంలో 10.02.2025వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సైదాపురం జడ్పీ హైస్కూల్ యందు  డా. నిత్య ప్రశాంతి సందర్శించి పిల్లల ఆరోగ్యం పట్ల పలు సూచనలు సలహాలు ఇస్తూ  నులిపురుగులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు. నులిపురుగులు వల్ల రక్త హీనత వస్తుంది. దాని వల్ల పిల్లలో చురుకుదనం, సరిగ్గా చదువుకోలేక పోవడం ఉంటుంది అని చెప్పారు.  గోళ్ళు శుభ్రం గా ఉంచుకోవాలి, ఆడుకున్న తర్వాత, తినే ముందు, మరుగు దొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా కడ్డుకోవాలి అని చెప్పారు. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ గురించి వివరించారు. అలా చేయకపోయినట్లయితే కడుపులో నొప్పిగా ఉండడం వస్తుందని వివరించి

 ఆల్బెంజల్ టాబ్లెట్  పిల్లలకి వేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, డా నిత్య ప్రశాంతి, CHO T సొరకాయల శెట్టి, PHN S పుష్పమ్మ ఏఎన్ఎం శ్రీలత పాల్గొనారు.