అరకువేలి ప్రభుత్వ వైద్య బృందం మరియు ఎ.పి.టి.డబ్లు.ఆర్.ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఎన్.ఎస్.ఎస్.విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీతో ప్రపంచ ఏయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్ దినోత్సవం.





అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో అరకువేలి ఎ.పి.టి.డబ్లు.ఆర్.ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఎన్.ఎస్.ఎస్.విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఏయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్,ప్రోగ్రాం అరకువేలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏయిడ్స్ నిర్ములన గురుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా అరకువేలి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య అధికారిణిలు మాట్లాడుతూ హెచ్.ఐ.వి.ఏయిడ్స్ రోగులకు వైద్య సేవలో భాగంగా అందరిలాగానే వారికీ కూడ వైద్యం అందించి వారికి తగిన దైర్యం ఇచ్చి అన్నివేళలా దగ్గర ఉంటూ మెరుగైన చేవలు అందిస్తామని వైద్య బృందం ప్రతిజ్ఞ చేసారు, అనంతరం ఆరుకువేలి ప్రభుత్వ ఏరియా అస్పటల్ నుంచి మెయిన్ సెంటర్ వరకు సామూహిక ర్యాలీ చేయడం జరిగింది