జర్నలిస్టుల సంక్షేమ పథకాలను  తక్షణమే పునరుద్దించండి.                      

 ---ఏ.పి.ఏం.పి. ఏ. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరాం యాదవ్ డిమాండ్                         



ఏలూరు, డిసెంబర్ 9 :  గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఏ.పి.ఏం.పి.ఏ.) రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా కన్వీనర్ మెరుగు మువ్వల  శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశం లో  శ్రీ రామ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రతి రోజు అనేక జీ.ఓ.లను విడుదల చేస్తున్న ప్రభుత్వం, ప్రజలకు ప్రభుత్వంకు వారధిగా నిలుస్తూ సమాజ శ్రేయోభిలాషులైన జర్నలిస్టుల సంక్షేమం లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని   ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ఇవ్వవలసిన అక్రిడేషన్, జర్నలిస్టులో అబద్ధత భావాన్ని పెంచే విధంగా తయారైందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్ ఇవ్వలేకపోవటం ప్రభుత్వ  నిర్లక్ష్యం కు నీదర్శనంగా ఉందన్నారు,మీడియా అక్రిడిటేషన్ జీ.ఓ.  ఇచ్చిన ఆరు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి నేటికి ఇవ్వలేక    తీవ్ర ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల  వర్కింగ్ జర్నలిస్టులు అభద్రతా భావానికి గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జీవోలో ఉన్న తప్పకుండా సరిచేసి తక్షణమే  వర్కింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా  జర్నలిస్టులు అందరికీ సులభతరంగా అక్రిడేషన్ మంజురు అయ్యే జీవోలు తగు మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న జర్నలిస్టు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ,, సంక్షేమ నిధి తక్షణమే పునరుద్ధదించాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పరిమితి రెండు లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచాలని  శ్రీ రామ్ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక ఇంటి నిర్మాణానికి తగు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు పెన్షన్స్ సౌకర్యం  అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్కింగ్ మీడియా ప్రతినిధులకు 15,000 పెన్షన్ సౌకర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు. జర్నలిస్టుల మీద, పత్రిక కార్యాలయాల మీద దాడులు  జరుగుతున్న నేపధ్యంలో  తక్షణమే మీడియా దాడుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. డిసెంబర్ 15 లోపల జర్నలిస్ట్ సంక్షేమ పథకాల పునరుద్ధరణ పై విధాన ప్రకటన రాకపోతే ఏ.పి.ఏం.పి.ఏ. ఉద్యమ బాట పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   ఏ.పి.ఏం.పి. ఏ.జిల్లా కో. కన్వీనర్ లు నాగబోయిన పేర్రాజు,ఏం.జీవన్ ప్రసాద్ మరియు సీనియర్ గౌరవ సలహాదారులు దాసరి రామచందర రావు,నాయకులు ఎర్లీ పోస్ట్ ఎడిటర్ మిల్టన్ మరియు నాయకులు సతీష్,పళ్లెం అబ్రహం, చప్పిడి వాసు,, దాసరి రామచందర్ రావు, టి.నరేష్,పి. సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.