కాఫీ బెర్రీబోరార్ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ కొరకు కాఫీ రైతులు మరియు కాఫీ కొనుగోలుదారులు తగు జాగ్రత్త తీసుకోవాలని
కాఫీ బెర్రీబోరార్ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ కొరకు కాఫీ రైతులు మరియు కాఫీ కొనుగోలుదారులు తగు జాగ్రత్త తీసుకోవాలని లేని యెడల అతిక్రమాణాలకు చట్టపరమైన చర్యలు తప్పవని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారిచేశారు
అల్లూరిసితారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అల్ ట్రేడర్స్ లకు ఈరోజు కలెక్టర్ ఆఫిసులో జరిగిన మీటింగులో ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ ఆధికారినీ శ్రీ తిరుమణిశ్రీపూజ మాట్లాడుతూ కాఫీకి సోకిన బీర్రీబోరార్ తెగులు కాఫీకొనుగోలు చేసి తీసుకో వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతములో గోనుగోలు చేసిన కాఫీ మరో ప్రాంతానికి తీసుకోని వెళ్లకుండ ఎక్కడ కొనుగోలోలు చేసిన కాఫీ అక్కడే బోయిలింగ్ చేసి ఎండపెట్టడము వలన బెర్రీబోరార్ వ్యాధి నియంత్రంచవచ్చు అని మన ప్రాజెక్ట్ అధికారినీ అన్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఈ వ్యాధి నియంత్రణ గురించి అనేక సూచనలు తెలియచేసి ఒక ప్రాంతములో కొనుకోలు చేసిన కాఫీ మరో ప్రాంతములో తీసుకోని వెళ్లకుండా రెండు నిమిషాలు బయిలింగ్ చేసి ఎండ బెట్టాలనీ తరువాత రవాణా చెయ్యటం వల్ల మరోప్రాంతాని ఈ తెగులు వ్యాప్తి చెందే ప్రమాదము ఉండదని అన్నారు.ప్రతీ ఒక్క కాఫీ రైతులు,కాఫీ వ్యాపారాలు జాగ్రత్తలు తీసుకోని కొనుగోలు చెయ్యాలని అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడుతూ బెర్రీబోరార్ తెగులు నియంత్రణ గురుంచి ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తిసుకోవాలి ఎటువంటి అనుమతిలేకుండా కాఫీ గోనుగోలు చేసిన వారి పై క్రిమినల్ కేసు వేయడము జరుగుతుందని అన్నారు.బేరిబోరార్ తెగులు మరో ప్రాంతానికి వ్యాధి నివారణ కొరకు ప్రత్యేకించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాము.ఎటు వంటి అనుమతి లేకుండా కాఫీ రావణ చేస్తుంటే దొరికిన వారిపై క్రిమినల్ కేసు వేసి బండి కుడా ముసివేయడము జరుగుతుంది అని అన్నారు.వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది,ట్రేడర్స్ లకు కాఫీ గోనుగోలు చేయుటకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా సర్టిఫికెట్ జరిచేయడము జరిగింది. బెర్రీబోరార్ వ్యాధి నియంత్రణ కొరకు ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసి ప్రతీ సంతలో నిగ వేయవలచిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అధికారులు తెలియచేసిన నియానిబంధనలు అతిక్రమించినా ఎవరైనా కొనుగోలు చేసినవారి పై లేండ్ అడర్ ఎక్ట్ కింద వారిపై క్రిమినల్ కేసు వేయాలని అధికారులకు ఆదేశించారు