ముగిసిన తొలి దశ నామినేషన్ల పర్వం!

 డిసెంబర్ 1 నుండి అప్పిళ్లకు అవకాశం!

 డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు



హైదరాబాద్:డిసెంబర్ 01

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈదశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈసారి పంచాయతీ ఎన్నికలకు తీవ్ర పోటీ నెలకొన్నది. యువతరం పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్పంచి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నోటిఫై చేయగా, సర్పంచి పదవుల కోసం మొత్తం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి.  చివరిరోజైన శనివారం ఒక్కరోజే 17,940 నామి నేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో ఆరుగురు పోటీపడుతున్నా రు. 37,440 వార్డు సభ్యులకు గాను 82,276 నామినేషన్లు దాఖలయ్యా యి. అందులోనూ ఒక్క 29 నే 70,596  నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నట్లు తేలింది.  సర్పంచి, వార్డు సభ్యుల పదవులు పార్టీ రహితంగా నిర్వహి స్తున్నప్పటికీ  ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. కాగా తొలిదశ నామినేషన్ల ఉససంహరణ డిసెంబరు 3న ఉంటుంది. తర్వాత బరిలో ఉండే వారి సంఖ్యలో స్పష్టత రానుంది.  తొలిదశ పంచాయతీ ఎన్నికలు డిసెంబరు 11న జరుగుతాయి. అదేరోజున ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 1 న అప్పీల్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 2న అప్లీళ్లను పరిష్కరిస్తా రు.  డిసెంబర్‌ 3న నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. ఇద్దరు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేరు, వృత్తిని పరిగణన లోకి తీసుకుని రిటర్నింగ్‌ అధికారి గుర్తును కేటా యిస్తారు.  డిసెంబర్‌ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిం చనున్నారు