Karnataka: మరోసారి ‘బ్రేక్ ఫాస్ట్’ మీటింగ్?



కర్ణాటక ‘CM’ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్య, DK శివకుమార్ కలిసి <<18419745>>బ్రేక్‌ఫాస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 9.30కు బెంగళూరులో మరోసారి వారిద్దరూ భేటీ అవుతారని తెలుస్తోంది. సిద్దరామయ్యను శివకుమార్ ఆహ్వానించారని సమాచారం. తొలి మీటింగ్ సిద్దరామయ్య నివాసంలో జరగ్గా, రెండోది శివకుమార్ ఇంట్లో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు నేతలు ఇప్పటికే ప్రకటించారు.