పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం


దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.