నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 400 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న మన ఎమ్మెల్యే డా//వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు  వైఎస్సార్ సీపీ నాయకులు తమ స్వంత నిధులతో కష్ట కాలంలో పేదలకు సహాయం చేస్తున్నారని,
కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి గారైన స్వర్గీయ శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా దశలవారీగా మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ట్రస్ట్ సభ్యులు,వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు యల్లసిరి గోపాల్ రెడ్డి గారు,పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు గారు,నాసిన నాగులు గారు,నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు,కోట మొబీన్ బాషా గారు,గిరి గారు, రూరల్ ఎస్.ఐ. పుల్లారావు గారు,గ్రామ సచివాలయం సిబ్బంది,గ్రామ వాలేంటిర్లు ఉన్నారు