వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!
వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!
వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ నెలలోనే ఇండియాకు రానుంది. 2020 ఫిబ్రవరి తర్వాత ఆ దేశం నుంచి ఈ స్థాయిలో ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల 1 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌తో సూయజ్‌మ్యాక్స్ నౌక గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కొన్నిరోజులుగా సరఫరా నెమ్మదించింది. ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా వెనిజులా నుంచి దిగుమతులను ఇండియా పెంచుకుంటోంది.