సూళ్లూరుపేటలో ప్రశాంతంగా బక్రీద్ వేడుకలు.

 మన్నారుపోలూరు ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు.

 సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-


 పట్టణ పరిధిలోని మన్నారు పోలూరు గ్రామంలో ముస్లిం సోదరులు బక్రీదు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. త్యాగానికి ప్రత్యేకంగా జరుపుకునే బక్రీదు పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఈద్గా మైదానంలో సుమారు 2000 మందికి పైగా ముస్లిం సోదరులు ఒకే చోటకు చేరి నమాజులు నిర్వహించారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు పటిష్ట వ్యూహంగా అద్భుతంగా నిర్వహించారు.