సూళ్లూరుపేట రెగ్యులర్ ఆర్డీవోగా వి. దేవేంద్ర రెడ్డి నియామకం.

 ప్రభుత్వం పూర్తి అధికారిక ఉత్తర్వులు జారీ.

ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుండి పూర్తి స్థాయి రెగ్యులర్ ఆర్డీవోగా పదవీ బాధ్యతలు.

తిరుపతి  కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుండి సూళ్లూరుపేటకు బదిలీ.

రెగ్యులర్ అధికారి రాకతో నియోజకవర్గంలో వేగవంతం కానున్న రెవెన్యూ, భూ వివాదాల పరిష్కారాలు

 రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:- 


సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పూర్తి స్థాయి రెగ్యులర్ రెవెన్యూ డివిజనల్ అధికారి గా  వి. దేవేంద్ర రెడ్డి  ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుపతిలోని కేఆర్ఆర్‌సీ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, గత కొంతకాలంగా సూళ్లూరుపేట డివిజన్ ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా కూడా అదనపు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.

ఇన్‌ఛార్జ్ కాలంలోనే డివిజన్‌లోని అన్ని మండలాల రెవెన్యూ వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించిన దేవేంద్ర రెడ్డి ని.. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడే పూర్తి స్థాయి రెగ్యులర్ ఆర్డీవోగా ఖరారు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మరియు కోర్టు పరిధిలోని భూ వివాదాల పరిష్కారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రెగ్యులర్ అధికారిగా రావడం వల్ల, డివిజన్ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక భూ సమస్యలు, కోర్టు వివాదాలు త్వరితగతిన కొలిక్కి రానున్నాయి. సూళ్లూరుపేట రెగ్యులర్ ఆర్డీవోగా అధికారికంగా పూర్తి బాధ్యతలు స్వీకరించారు.