ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. కీలక అప్‌డేట్
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. కీలక అప్‌డేట్
కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో ఇటీవల ఆమోదించడంతో తాజాగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆ ఫైల్ సీఎంవోకు చేరుతుంది. ఆ తర్వాత మళ్లీ కేబినెట్ ముందుకు తీసుకొచ్చి ఆమోదిస్తారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ఫైల్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.