కృష్ణా: బెట్టింగ్ మాఫియా.. 

కొందరిపైనే చర్యలా..?

కృష్ణా జిల్లాలో బెట్టింగ్‌ల నియంత్రణకు పోలీసులు చేపట్టిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది. మచిలీపట్నం రూరల్‌ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కేవలం YCP సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన TDP వర్గీయులపై చర్యలు తీసుకోలేదని, ఏకపక్షంగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.