ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేముందు ఇవి చెక్ చేయండి!
ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేముందు ఇవి చెక్ చేయండి!
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులను FSSAI అప్రమత్తం చేసింది. ‘ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను చూసి మోసపోకండి. ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ను చదవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా అందులోని పదార్థాలు, అలర్జీ సమాచారం, FSSAI లైసెన్స్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, పోషక విలువలతో పాటు చక్కెర, ఉప్పు, కొవ్వు పరిమాణాలను గమనించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది’ అని సూచించింది.