తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు!

అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలకు విరామం


తిరుమల, రవి కిరణాలు : సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించే ఉద్దేశంతో అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను మినహాయించి మిగిలిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తెలిపింది. అలాగే సెప్టెంబర్ 30, అక్టోబర్ 4 తేదీల్లో సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.