రామాపురంలో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
*
*రామాపురంలో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
*– ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం*
*– సభా వేదిక, ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర*
*– ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం*
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదివారం ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నెల 29న వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం వేదికగా నిర్వహించనున్న 'పల్లె పండుగ 3.0' భారీ బహిరంగ సభా స్థలిని, ఇతర కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎంపీ గారు పరిశీలించారు. ఈ పర్యటనలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ బీద రవిచంద్ర గారు, ముఖ్యమంత్రి పర్యటన కోఆర్టినేటర్ సత్యనారాయణ రాజు గారు, స్థానిక కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎంపీ గారి వెంట పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామాపురం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,000 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.
సభా స్థలంతో పాటు, వీఐపీ పర్యటన, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పురోగతిని ఎంపీ గారు పరిశీలించారు. సభకు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ నీటి వసతి, షామియానాలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెల రూపురేఖలు మార్చడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో ప్రజలు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ గారు కోరారు.
*.*