ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతి యే బక్రీద్...!

ప్రవక్త ఇబ్రహీం త్యాగం మానవాళి కి ఆదర్శం..!

ముస్లిం సోదరులకు, సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన..!

జలదంకి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా..!


ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతియే బక్రీద్ పండుగ పరమార్థం అని బక్రీద్ సందర్భంగా జలదంకి మండలంలోని ముస్లిం సోదరులకు సోదరీమణులకు జలదంకి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతి ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవరచుకోవాలని ఆయన కోరారు. దేవుడి దయతో   ప్రజలందరూ  ఆరోగ్యాలు, సుఖ శాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  మత సామరస్యం  వెల్లివిరియాలన్నారు. ఈ సందర్బంగా  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు..