సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..



 పొదలకూరు, రవి కిరణాలు : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వద్ద మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'పల్లె పండుగ 3.0' కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాపురం పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ ప్రజలతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు,  ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు.