కర్ణాటక డీజీపీ దయానంద్ ను కలిసిన వెంకటేష్ నాయుడు
కర్ణాటక డీజీపీ దయానంద్ ను కలిసిన వెంకటేష్ నాయుడు
డీజీపీగా పదోన్నతి పొందినందుకు అభినందనలు
పొదలకూరు, రవికిరణాలు : నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన పల్లెటి వెంకటేష్ నాయుడు బెంగళూరులో కర్ణాటక డీజీపీ దయానంద్ ఐపీఎస్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన శ్రేయోభిలాషి దయానంద్ డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బెంగళూరు సిటీ వైట్‌ఫీల్డ్ డివిజన్ డీసీపీగా పనిచేస్తున్న మరో శ్రేయోభిలాషి సైదులు అడవత్ ఐపీఎస్‌ను కూడా వెంకటేష్ నాయుడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా మాట్లాడుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు.
వ్యాపార రంగంలో బెంగళూరులో కొనసాగుతున్న పల్లెటి వెంకటేష్ నాయుడికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో స్నేహపూర్వక పరిచయాలు, ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ బెంగళూరులో తనకంటూ ప్రత్యేక పరిచయ వర్గాన్ని ఏర్పరుచుకున్నారని పేర్కొన్నారు.
