పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు
September 29, 2026
Bogolu Mandal leaders making arrangements for the 'Palle Panduga' festival
- People from Bogolu Mandal turned out in large numbers
పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు
- పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు
బిట్రగుంట, రవి కిరణాలు : ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లు ఉదయగిరి పల్లె పండుగ కార్యక్రమానికి రానున్న సందర్భంగా బోగోలు మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. కావలి నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భోజన వసతులు ఏర్పాటు చేశారు. వేలాది మంది సభకు తరలివెళ్తున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ భోజనం అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా మండల నేతలు సిద్ధం చేశారు. సందర్భంగా మండల టిడిపి నాయకులు మాలేపాటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
