బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్
మునిసిపాలిటీ పరిధిలోని విద్యానగర్ లో గల పాత నాలుగో వార్డు, స్థానిక ఎస్ఎస్ కళ్యాణ మండపం వీధిలోని పాత 13వ వార్డు, పుట్ట వీధిలోని పాత పదకొండవ వార్డు ఈ మూడు వార్డులలో సుమారు రెండు కోట్లతో సిసి రోడ్లను ఏర్పాటు చేసేందుకు నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు లేవని ఎవరు కూడా ప్రశ్నించకుండా అన్ని విధాలుగా మునిసిపాలిటీని అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకొని మునిసిపాలిటీని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శనివారం మూడు వార్డులలో, ఆది వారం మరో మూడు వార్డులలో శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చి రెడ్డిపాలెం ముంబై జాతీయ రహదారి ఎన్ హెచ్ 67 ను సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్.హెచ్ చైర్మన్ కు ప్రతిపాదనలు ఇవ్వగా కేవలం మూడు రోజుల్లోనే 14 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు రైలింగ్ సమస్యను కూడా తీర్చినట్లు ఎంపి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి తాము ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ, డబ్బు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం నిలిపిన అభ్యర్థులను గెలిపించుకొని మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఎంపి కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వైస్ చైర్మన్ లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, పటాన్ నస్రిన్, కమీషనర్ ఇనమల చిన్నబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు,పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు, టంగుటూరు మల్లికార్జున రెడ్డి, మోర్ల మురళి, స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు
.jpeg)
