బొమ్మన శ్రీధర్ ను సన్మానించిన (ఏపీ సి ఓ ఎఫ్) కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉన్నతాధికారులు.

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/తడ :-


 రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బొమ్మన శ్రీధర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సొసైటీల ఫెడరేషన్ (ఏపిసిఓఎఫ్) ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. విజయవాడలోని మత్స్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఏపిసిఓఎఫ్ చైర్మన్ యాతగిరి రాంప్రసాద్, కార్పొరేషన్ ఎండీ మరియు జీఎం కలిసి బొమ్మన శ్రీధర్ ను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ వారితో మాట్లాడుతూ మత్స్యకార మరియు బెస్త కుటుంబాల ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ఏపిసిఓఎఫ్ మరియు బెస్త కార్పొరేషన్ సంయుక్తంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను, వారి సంక్షేమ భృతిని పెంచడంతోపాటు, మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బొమ్మన శ్రీధర్ అన్నారు.