నాయుడుపేట పోలేరమ్మ జాతరకు 300 మంది పోలీస్ సిబ్బంది తో భారీ బందోబస్తు: డిఎస్పీ చెంచుబాబు

రవికిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట /నాయుడుపేట :-




​నాయుడుపేట పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, జాతర ప్రశాంతంగా ముగిసేలా డిఎస్పీ చెంచుబాబు గారి నేతృత్వంలో మొత్తం 300 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో భాగంగా సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ట, నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు, నాయుడుపేట టౌన్ సీఐ టి.వెంకటేశ్వర్లు మరియు వెంకటగిరి సీఐ ఎం.రోశయ్యలతో కూడిన నలుగురు సీఐల బృందం పర్యవేక్షణలో 15 మంది ఎస్సైలు బాధ్యతలు నిర్వహిస్తారు.

​వీరితో పాటు 260 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మరియు మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా 25 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉంటారు. జాతర జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచుతామని, భక్తులు పోలీసులకు సహకరించి జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు కోరారు.