మీ ఫోన్ పోతే ఇలా చేయండి..!
నెల్లూరులో మీ ఫోన్ పోతే ఇలా చేయండి..!
ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను నెల్లూరు జిల్లా పోలీసులు రికవరీ చేస్తున్నారు. రూ.1.14 కోట్ల విలువైన 570 ఫోన్లను పోలీసులు రికవరీ చేయగా.. వాటిని ఎస్పీ డా.అజిత వేజెండ్ల శుక్రవారం బాధితులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఫోన్ పోయిన వారు వెంటనే IMEI నంబర్, బిల్లుతో www.ceir.gov.in పోర్టల్‌లో లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.