శ్రీకాళహస్తి ,  రవికిరణాలు :   శ్రీకాళహస్తి నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పావని గారికి మర్యాదపూర్వకంగా కలిసిన దేవస్థానం చైర్మన్, జనసేన నాయకులు  శ్రీకాళహస్తికి నూతనంగా డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పావని గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.  ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు శ్రీమతి పావని గారిని శాలువాతో సన్మానించి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రసాదాలను అందజేశారు.


శ్రీకాళహస్తి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నూతన డీఎస్పీగా శ్రీమతి పావని గారు విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జయ ప్రకాష్, కుమార్,గరికపాటి చంద్ర,మాధవ మహేష్ తదితరులు పాల్గొన్నారు.