రవికిరణాలు :   అన్ని ఆస్పత్రుల్లో అందించే చికిత్సల ధరలను ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రతి చికిత్సకు సంబంధించిన రేట్లను ఇంగ్లిష్ తో పాటు స్థానిక భాషలోనూ ప్రదర్శించాలని పేర్కొంది. ఈ నిబంధన అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఆస్పత్రి బిల్లుల విషయంలో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను తగ్గించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది.