"స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయం - కాకాణి"



నెల్లూరు, రవికిరణాలు :  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, సర్వేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామాల వారీగా సమావేశమై,స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్థన్ రెడ్డి గారు


- సర్వేపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశాలు  పూర్తి కావడంతో గ్రామాల వారీగా సమావేశాలు ప్రారంభం.

- ⁠గ్రామాల వారీగా పార్టీ సభ్యత్వానికి చెందిన గుర్తింపు కార్డులు అందించిన కాకాణి 

- స్థానిక నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న కాకాణి 

- వెంకటాచలం మండలంలో రెండు విడతలుగా గ్రామ స్థాయి సమావేశాల నిర్వహణ  

- ఈరోజు 14 గ్రామాల నాయకులతో సమావేశమై స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చించిన కాకాణి  

- గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కాకాణి

- స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ఎదుర్కొని విజయం సాధించాలన్న కాకాణి.

- టీడీపీ బెదిరింపులు, కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతాం

- స్థానిక పోరుకు తమ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పూర్తి సిద్ధం

- గతంలో అభ్యర్థులు లేక చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారు

- పోటీ చేసే ధైర్యం లేక చంద్రబాబు కాడి కింద పడేశారు

- టీడీపీవి అడుగడుగునా ద్వంద్వ విధానాలే

- స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తాం  


మాజీమంత్రి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..

​స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమాయత్తం..

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరానికి సిద్ధమవుతున్నాయని కాకాణి తెలిపారు. స్థానిక సమరంలో విజయావకాశాలపై ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సన్నద్ధతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

​సర్వేపల్లి నియోజకవర్గ సమీక్షలు...

సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా ఇప్పటికే విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై చర్చించడంతో పాటు వారి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిపారు.

​ప్రతి గ్రామానికి ప్రాధాన్యత...

ప్రతి గ్రామాన్ని కవర్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వెంకటాచలం మండలానికి సంబంధించి రెండు భాగాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా తొలి విడత కొన్ని గ్రామాలతో సమావేశం పూర్తయిందని తెలిపారు.మిగిలిన సగం గ్రామాలు, దాదాపు 14 గ్రామాలకు సంబంధించిన నాయకులతో  ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్షేత్రస్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశామని కాకాణి వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయం …

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేస్తుందని కాకాణి స్పష్టం చేశారు. అధికార పార్టీ తెలుగుదేశం సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించినప్పటికీ, వాటిని తిప్పికొట్టి సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ ఎన్నికల కోసం తమ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.  

గతంలో జరిగిన ఎన్నికలను ప్రస్తావిస్తూ కాకాణి టీడీపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో లోపాయికారీగా వ్యవహరించారని ఆరోపించారు. పోటీ చేయడానికి అభ్యర్థులు లేక, పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నందున బహిరంగంగా "బహిష్కరిస్తున్నాం" అని ప్రకటనలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల కొరత వల్ల పోటీ చేసే పరిస్థితి లేకే చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసి కాడి కింద పడేశారని కాకాణి విమర్శించారు.బయటికేమో చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నమ్మిస్తూ, లోపల మాత్రం గెలిచే అవకాశం ఉన్నచోట పోటీ చేయమని ప్రోత్సహించే ద్వంద్వ విధానాన్ని ప్రదర్శించారని.ధ్వజమెత్తారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుంది..అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధం..

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని, విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులై ముందడుగు వేయాలని కాకాణి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి కార్యకర్తల భావోద్వేగాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

ద్రబాబు పాలనపై నమ్మకం లేకే కుట్రలు..

చంద్రబాబు గతంలో 'సూపర్ సిక్స్', 'సూపర్ సెవెన్' వంటి అనేక అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు కూడా తన పాలనపై నమ్మకం లేక, సీఎంగా ధైర్యంగా ఓట్లు అడిగే పరిస్థితి లేకపోవడంతోనే మళ్లీ మోసపూరిత రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు.  

కొత్తగా పింఛన్ల మంజూరు పేరుతో చంద్రబాబు ఒక నాటకానికి తెరతీశారని, ఎన్నికల ఉద్దేశంతోనే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను సాకుగా చూపి పింఛన్లు ఎగ్గొట్టే ఉద్దేశమే తప్ప, ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ వైపు ఉంటే పింఛన్లు రావనే భయాన్ని ప్రజల్లో కల్పించి ఓట్లు పొందాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, కానీ చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని కాకాణి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రకరకాల అక్రమ మార్గాలు, ప్రయోగాలు చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. కూటమి నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమంగా రౌడీషీట్లు తెరవడం, ఆస్తులు, పొలాల రీ-సర్వే పేరుతో వేరేవాళ్ల పేర్లు రాయడం, గ్రామాల్లో ఉద్రిక్తతలు సృష్టించడం వంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపిస్తూ పీడీ యాక్ట్‌లు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.  

పక్షపాతంతో వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం,.. జిల్లా అధికారులకు ఒకటే తెలియజేస్తున్నా . "ఈ రోజు మీచేత తప్పులు చేయించే బడా బాబులు రేపు ఏ ఒక్కరూ కనిపించరు; హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు పారిపోతారు. చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు" అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారులు, టీడీపీ నాయకులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. దీనిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమ కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై 'ఒకటికి నాలుగు రెట్లు' చొప్పున చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.  

రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.. కలెక్టర్, ఎస్పీ గార్లలకు విజ్ఞప్తి చేస్తున్నా... ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ చెప్పినట్లు తందానా అంటే కుదిరేది లేదన్నారు. 

టీడీపీలాగా అధికారం ఉంటే పోటీ చేయడం, లేకపోతే ఎన్నికలను బహిష్కరించి చేతులు ముడుచుకుని కూర్చోవడం తమ పద్ధతి కాదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీలో జగనన్న సైనికులు ఉన్నారని, గుండె ధైర్యంతో పోరాడే సత్తా తమకు ఉందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి మనోబలంతో, పోరాటంతో ముందుకెళ్తామన్నారు 

నెల్లూరు జిల్లాకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం.. 

నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం మరియు కూటమి నేతల అసంబద్ధ నిర్ణయాల వల్ల జిల్లాలో సాగునీటి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని కాకాణి  మండిపడ్డారు. మొదటి పంటకు పూర్తిస్థాయిలో నీరు అందించాల్సిన అధికారులు, రిజర్వాయర్లను ఖాళీ చేసి కేవలం 1లక్షా 80 వేల ఎకరాల రెండవ పంటకోసం 64 టీఎంసి ల నీటిని వృధా చేశారని విమర్శించారు. జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 6 లక్షల ఎకరాల వరకు తొలి పంట సాగవుతున్న తరుణంలో సరి అయిన నీటి ఆజమాయిషీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఏపీ ప్రయోజనాలు పక్కనబెట్టారు..

 'ఎల్ నినో' ప్రభావంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు వచ్చినప్పటికీ.. శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు వచ్చిన తర్వాత కూడా శ్రీశైలం జలాశయాన్నుండి నీటిని సోమశిలకు తరలించి, సోమశిల ద్వారా సర్వేపల్లి రిజర్వాయర్ కి ఇచ్చి, సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది.

కానీ శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లను వదిలిపెట్టకుండా, సోమశిల జలాశయానికి చుక్క నీరు రాకుండా అడ్డుకట్ట వేసి, ఒక పక్కేమో ఆంధ్రా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే... చంద్రబాబు నాయుడు గారు మాత్రమేమో తెలంగాణకి సంబంధించి పవర్ జనరేషన్ పేరిట, లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రకరకాలుగా ఒక రోజుకి 5 టీఎంసీల నుంచి 6 టీఎంసీల నీళ్లు దోచుకుపోతున్నా చూస్తూ ఉండి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊడిగం చేశారే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదని దుయ్య బట్టారు 

రైతుల తరఫున పోరాడితే కేసులు..

నెల్లూరు బ్యారేజీ వద్ద హక్కుగా రావాల్సిన సాగునీటి కోసం ధర్నా చేపడితే, తమను అడ్డుకుని కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు ఇవ్వమని అడిగినందుకు తమపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

 స్థానిక నేతల మౌనంపై విమర్శలు..

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా ఇతర కూటమి నేతలు సమీక్షల్లో, సమావేశాల్లో మైకుల ముందు గొప్పలు మాట్లాడతారని,శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు ఎందుకు నెల్లూరు జిల్లా ప్రజలకు ఇవ్వలేకపోయారు? చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా రైతాంగానికి ద్రోహం తలపెడుతుంటే ఎందువల్ల మీరు మౌనంగా, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారనేటువంటి దానికి సమాధానం చెప్పాలన్నారు 

సోమిరెడ్డి షరతు రాజకీయ నాటకం..

 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గారిపై పెట్టిన షరతులపై కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ విషయంలో సీబీఐ విచారణకు ఒప్పించేంత స్థాయి, అర్హత సోమిరెడ్డికి లేవని తీవ్ర విమర్శలు గుప్పించారు.గాలిలో గెలిచి, నా చేతిలో రెండు సార్లు మొత్తం మీద అయిదు సార్లు వరుసగా ఓడిపోయిన చరిత్ర ఉన్న వ్యక్తి సీబీఐ విచారణల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యవహారంలోనూ కమిషన్లు, షరతులు విధించడం సోమిరెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపించారు.

కమిషన్ల కండిషన్లు: రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసుకోవచ్చు కానీ ఎకరానికి ₹5 లక్షలు, గ్రావెల్ తోడుకోవచ్చు కానీ లోడుకి ₹10 వేలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని విక్రయాలు చేపట్టవచ్చు కానీ తనకు మార్కెట్ విలువలో  75% ఇవ్వాలి అని డిమాండ్ చేసే అలవాటు ఉన్నట్లే, సోమిరెడ్డి డీఎస్సీ సీబీఐ విచారణ విషయంలోనూ కండిషన్లు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు.

రియల్ ఎస్టేట్ దందాలు: సోమిరెడ్డి కుమారుడి ద్వారా దేనికైనా పర్మిషన్లు ఇప్పిస్తామని చెప్పి కండిషన్లు పెడుతూ డబ్బు వసూళ్లలో వ్యవహరించే తీరు సర్వేపల్లి ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందని తెలిపారు.కాకుటూరు శివాలయ భూముల ఆక్రమణ, అమ్మకాల వ్యవహారంలో సోమిరెడ్డి పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.శివరాత్రి సందర్భంగా శివాలయ భూముల వ్యవహారంలో తాను కానీ, తన కుటుంబం కానీ లేఅవుట్ యజమానుల నుంచి రూపాయి కూడా లంచం తీసుకోలేదని దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాలు విసిరారు. కాకుటూరు శివాలయం ముందు నిలబడి నిజాయితీ నిరూపించుకుంటేనే సోమిరెడ్డి మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందని, ప్రజలందరూ ఆయన   డబ్బు తీసుకోలేదనే  సమాధానం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

భూకబ్జాలు, ఆక్రమణలపై ప్రశ్నిస్తే దాడులా?.. 

భూకబ్జాలు, గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయించడం సరికాదని కాకాణి హితవు పలికారు, కసుమూరులో 

పట్టాభిరామస్వామి దేవస్థానానికి చెందిన భూములు, ప్రభుత్వ భూములతో కలిపి 1ఎకరా 91సెంట్ల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి కమిషన్లకు కక్కుర్తి పడుతూ ప్రభుత్వ, దేవాలయ ఆస్తులను కొల్లగొడుతుంటే అడిగిన వారిపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రగుంట సమీపంలో  వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి, వెనుకున్న భూమిని ఆక్రమించేందుకు సోమిరెడ్డి బ్యాచ్ ప్లాన్ చేశారని, కాగితాల పూరు వద్ద ప్రభుత్వ భూమిని ఏదో ఒక విధంగా పత్రాలు సృష్టించి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

పొదలకూరు మండలంలో చిట్టే పల్లి తిప్ప వద్ద అక్రమంగా గ్రావెల్ తోడుతుంటే సొంత పార్టీ (తెలుగుదేశం) నేతలే అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. "సొంత పార్టీ నేతలే నీ అవినీతిని ప్రశ్నిస్తుంటే, ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడివేనా?" అని తీవ్రస్థాయిలో సోమిరెడ్డిని 

నిలదీశారు.

ప్రతిపక్షంలో ఉన్నా,బెదరబోమని, అక్రమాలు, అవినీతిపై వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరుతో సహా 11 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటామని, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తామని కాకాణి స్పష్టం చేశారు.