పక్షవాతంతో మంచాన పడిన గిరిజన మహిళకు ఆర్థిక విరాళాలు సేకరించి కుటుంబానికి ఆదుకొంటున్న జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి
పక్షవాతంతో మంచాన పడిన గిరిజన మహిళకు ఆర్థిక విరాళాలు సేకరించి కుటుంబానికి ఆదుకొంటున్న జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు.మరింత ఆర్థికంగా విరాళాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం గడుతురు పంచాయితీ విందులపనుకు గ్రామానివాసి గంగాపూజారి.సత్యవతి గత వారంలో కాపీ తోటలో కాపీ పళ్ళు కోస్తూ కళ్ళు తిరిగి క్రింద పడగా కూడికాలు కుడి చేయ్యి నోరు మాట పడిపోయాయి ఈ విషయం తెలుకొన్న భర్త ఉటా ఉటిన తోట నుండి బుజనా మోసుకొని ఇంటికి తీసుకోని వచ్చి 108 అంబులెన్సులో పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు పరిస్థితి తీవ్రంగా ఉందని గమనించిన వైద్యులు అక్కడనుండి విశాఖపట్నం కే.జీ.హెచ్. తరలించి వైద్యం అందిస్తున్నారు అయితే భర్తకి ఎటువంటి ఆధారం లేదు కొన్ని సమయాల్లో మానసిక స్థితి బాగుండదు మూడు నాలుగు సంవత్సరాల కల్గిన ఇద్దరు మగపిల్లల్ని ఇద్దరు ఆడ పిల్లల్ని కూలీ నాలి చేసి పెంచే తల్లీ ఆ కుటుంబ పరిస్థితి దయానియంగా మారింది ఈ విషయాన్ని కే.జీ.హెచ్ హాస్పిటల్ నుండి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు సమాజా శ్రేయోభిలాషి జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా ట్రస్ట్ చైర్మన్ మరియు బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు తెలియజేయ్యగా తను కొందరి ద్రుష్టి తీసుకోని వెళ్లి కొంతఆర్థిక విరాళాలు సేకరించి కుటుంబానికి అందజేశారు,కానీ అది ఏ మాత్రం ఆ కుటుంబానికి సరిపోదని మరింత ఆర్థిక సహాయం చేసే దాతలు ముందుకొచ్చి సత్యవతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఆర్థిక సహాయం చేసే దాతలు 7981391699 దుక్కేరి.ప్రభాకరరావు ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు,