కాకాణీ..ఇంకా ఎన్ని వందల కోట్లు దండుకుంటావ్

  నీ అక్రమాలు,  అవినీతికి అదుపు లేదా

దోచుకోవడం..దాచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదు






పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి..ధరలు దిగిరావాలనే నినాదంతో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన  రాష్ట్రంలో భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో  సామాన్యులు కడుపు నిండని పరిస్థితి  కష్టకాలంలో ధరలు పెంచి దోచేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. సంపదను సృష్టించడం మాని అప్పులు చేస్తూ.. పన్నుల పేరుతో దోపిడీ చేస్తున్నారు.  నిత్యావసర వస్తువుల ధరలు ఈ రాక్షస ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి.  రైతులు, కూలీలు బతికే పరిస్థితి లేదు. పేదలు తమ బిడ్డలను బతికించుకోలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. .యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పొటాష్ నుంచి దోమల మందు వరకు అన్నీ ధరలను రెట్టింపు చేసేశారు. దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే ఉద్ధేశం జగన్ మోహన్ రెడ్డికి లేదు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలోనూ దోపిడీయే  పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటరుకు 10 నుంచి 15 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు, ప్రకృతి సంపదను దోచుకోవడమే ఈ పాలకుల పని  రామదాసు కండ్రిగలో 4వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఉంటే లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఎత్తేస్తున్నారు..

ఈ ఎమ్మెల్యే కాకాణికి ఎన్ని వందల కోట్లు కావాలో అర్థం కావడం లేదు. పోర్టుకు పోవాలంటే గేటు... కాకాని గేట్ పేరుతో కోట్ల రూపాయల దండకాలు సాగిస్తున్నారు. కాకాని గేటు దాటాలంటే లారీకి 1,000 నుంచి 1500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. ఇదెక్కడి ఖర్మో. ...మా వాళ్లను స్టేషన్ కి పిలిచి బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులను ఉపేక్షించేది లేదు. వారిపై పోలీసులు చేయి చేసుకుంటే వందల చేతులు లేస్తాయి.. ఆరోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త. దొంగ కేసులు ఎన్ని పెట్టుకుంటారో  పెట్టుకోండి..కానీ చెయ్యి  చేసుకోవడానికి మీకెవరిచ్చారు హక్కు. ఎల్లకాలం మిమ్మల్ని ఎమ్మెల్యేలు కాపాడారనే విషయాన్ని గుర్తుంచుకోండి