పసుపులేటి వెంకట రమణయ్యకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య.
పసుపులేటి వెంకట రమణయ్యకు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య.
నెల్లూరు [బోగోలు], రవికిరణాలు జూలై 30 :
బోగోలు మండలం చెంచులక్ష్మిపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ నాయకుడు పసుపులేటి సుధాకర్ సోదరుడు పసుపులేటి వెంకట రమణయ్య ఉత్తర క్రియల కార్యక్రమం బుధవారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని వెంకట రమణయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, చిలకపాటి వెంకటేశ్వర్లు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.