రాజకీయ పార్టీల నాయకులతో చర్చ....

రవికిరణాలు న్యూస్ ...తిరుపతి జిల్లా... దొరవారిసత్రం మండలం...

త్వరలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శనివారం దొరవారి సత్రం తాసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ గోపీనాథ్ రెడ్డి మరియు ఎంపీడీవో సింగయ్య ఎస్సై తిరుమల రావు గారు పలు సూచనలు అందించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేందుకు అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా కన్వీనర్ ఈశ్వర వాక శ్రీనివాసులు రెడ్డి, టిడిపి ప్రధాన కార్యదర్శి మనోజ్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు చింతకాని వెంకటరమణ నాయుడు, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.