ఘనంగా వంశీరెడ్డి జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు విపిఆర్‌ నివాసంలో ఘనంగా జరిగాయి. మండలంలోని  విడవలూరు రామతీర్థం ఊటుకూరు, దండిగుంట, వారిణి, పార్లపల్లి ముదివర్తి, రామచంద్రపురం, వావిళ్ళ  గ్రామాల్లో  ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కేక్ కట్ చేసి వంశీ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు టిడిపి నాయకులు ఈ సంబరాల్లో పాల్గొని వంశీ కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.