ఉపాధ్యాయుడు మృతదేహం వద్ద నివాళులర్పించిన ఎంఈఓ కృష్ణయ్య

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం  న్యూస్:-

గతంలో దొరవారిసత్రం మండలంలో అక్కరపాక, తనయాలి ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయులు గా పని చేసి ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండలం ఎం పి యు పి ఎస్ కలివెళ పాళెం లో పని చేస్తున్న  కోగిలి  జయరామయ్య (స్వగ్రామం అక్కరపాక) గురువారం మద్యాహ్నం నారాయణ హాస్పిటల్ మృతి చెందాడు జయరామయ్య  చిన్న వయసు నుండి డయాబెటిస్ వ్యాధి తో బాధింపబడుతూ గత కొంత కాలంగా కిడ్నీలు పాడై డయాలసిస్ తో జీవిస్తున్నారు. రెండు రోజుల నుండి తీవ్రమైన అస్వస్థతకు గురై మరణించారు శుక్రవారం మండల విద్యాశాఖాధికారి క్రిష్ణయ్య ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి ప్రభుత్వ సాయం కోసం అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. మండల ఉపాధ్యాయులు యం.వి.శేషయ్య, రాధయ్య, కిరణ్, సునీత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి సంతాపాన్ని తెలియజేశారు.