ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ వేమిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కారును ఇసుక టిప్పర్‌ ఢీకొని  ఏడుమంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.ప్రమాదం తీవ్ర ఆవేదన మిగిల్చిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిసిన ఎంపీ వేమిరెడ్డి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాలని ఆయన కోరారు.