కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటం చేయాలి

వైయస్సార్ కాంగ్రెస్ దౌర్జన్యాలను సహించేది లేదు

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలి

టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్


నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిరంతరం పని చేయాలని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలిసి మంగళవారం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి డివిజన్ ఇంచార్జి లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.                    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని కార్పొరేషన్ ఎన్నికల్లో మట్టి కల్పించేందుకు టిడిపి నేతలు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరారు.

స్థానిక సంస్థల లాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని అబ్దుల్ అజీజ్ ఘాటైన హెచ్చరికలు పంపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించేందుకు రాష్ట్ర కమిటీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వివరించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తాము ముందు నిలబడి పోరాటం చేస్తామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడ్డాలని చూస్తే అదే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని పేర్కొన్నారు...