కొండ్లపూడి మరియు దేవరపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
కొండ్లపూడి మరియు దేవరపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

నెల్లూరు [రూరల్], రవికిరణాలు జూలై 22 :
నెల్లూరు రూరల్ మండలంలోని కొండ్లపూడి మరియు దేవరపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారిని పి. సత్యవాణి మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ నర్సోజి రావు నెల్లూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి మరియు నెల్లూరు రూరల్ మండల వ్యవసాయ అధికారి ఎస్.వి నాగమోహన్ పాల్గొనడం జరిగింది. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారిని పి. సత్యవాణి మాట్లాడుతూ... రైతులు రసాయనిక ఎరువులు తక్కువగా వాడుకోవాలని తెలియజేశారు. అలాగే యూరియాను ఎకరాకు మూడు బస్తాల కంటే ఎక్కువ వాడరాదని తెలిపారు. అలాగే ఒక దఫా యూరియాను తగ్గించి నానో యూరియాను పిచికారి చేసుకున యడల రైతులకు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చునని తెలియజేయడం జరిగింది. అలాగే ఇఫ్కో కంపెనీ మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... నానో యూరియా గురించి మరియు నానో డి ఏ పి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నర్సోజి రావు మాట్లాడుతూ.... అన్నదాత సుఖీభవ ఎవరికైనా అర్హత లిస్టులో లేని ఎడల గ్రామ సచివాలయంలో తెలుపవలసినదిగా కోరారు. అలాగే సహా వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి మాట్లాడుతూ... రైతులు విధిగా పచ్చిరొట్ట ఎరువులు వాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అనంతరం నెల్లూరు రూరల్ మండల వ్యవసాయ అధికారి ఎస్. వి నాగమోహన్ మాట్లాడుతూ... పంట వేసిన ప్రతి రైతు ఈ పంట చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే ఈ పంట నమోదు చేయించుకోని యెడల ప్రభుత్వం నుంచి వచ్చు అన్ని పథకాలకు వర్తించవని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఈఓ బానోతు శ్రీనివాసులు మరియు విఏఏలు పుష్పలత,అనూష మరియు రైతులు విజయ్ కుమార్, సునీల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.