నేడు జగన్ పర్యటనను ఎంతమంది అడ్డుకోవాలనుకున్న సూర్యుని ఎదుట అరచేయి పెట్టడమే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.
నేడు జగన్ పర్యటనను ఎంతమంది అడ్డుకోవాలనుకున్న సూర్యుని ఎదుట అరచేయి పెట్టడమే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.
నెల్లూరు [కావలి], రవికిరణాలు జూలై 30 :
కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేడు నెల్లూరులో జరగబోయే జగన్ పర్యటనను గూర్చి పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఎంతమంది అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా సూర్యుని ముందు అరచేతిని పెట్టి ఆపాలని చూస్తే అది బూడిద అవుతుంది తెలిపారు. అలాగే వైసిపి నాయకులు కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం కూడా జగన్ పర్యటనను అడ్డుకోవడం అని అలాగే జగన్ పర్యటన రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా భయాన్ని కల్పించిందని తెలిపారు. గత రెండు సార్లు పర్యటన ప్రభుత్వం ఆటంకపరిచినప్పటికీ కూడా ఈసారి నేడు నెల్లూరుకి రావడం ఖాయమని సుమారు ఈ కార్యక్రమానికి లక్ష మంది పైగా ప్రజలు హాజరవ్వడం ఖాయమని తెలిపారు. అలాగే కావలి పట్టణాన్ని కాపు కాస్తానని చెప్పుకుంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్యాయాలు, అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇదే కాపు కాయడం అని ప్రశ్నించారు. అలాగే ఒక బుడము గుంటకు సంబంధించిన ఒక నాయకుడు అక్రమంగా గ్రాములనుండీ తోలుస్తూ అన్నిటికీ రారాజు కావ్య కృష్ణారెడ్డి అని తను కన్ను సన్నుల్లో ఈ అక్రమ గ్రవెల్ లు అక్రమ తవ్వకాలు ఇవన్నీ జరుగుతున్నాయని కావలి కాపు కాస్తానని చెప్పే ఈ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రజలందరూ విజయవంతం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.