తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
ద్విచక్ర వాహన దారులకు పోలీస్ వారి విజ్ఞప్తి.
Sec. 194 (D) of MV Act
No Helmet - No Petrol
డిసెంబర్ 15:12: 2025 నుండి అమలు చేయడం జరుగుతుంది
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో సుమారు 45% మరణాలు ద్విచక్ర వాహనదారుల మితిమీరిన వేగం మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణం వల్ల జరుగుచున్నవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 40% మరణాలు హెల్మెట్ వాడకం వల్ల తగ్గే అవకాశం ఉన్నట్లు జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. సరియైన రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే కుటుంబంలో ఒకరు మరణిస్తే కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. ఈ నేపధ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 15:12:2025 జిల్లాలో No Helmet - No Petrol నిబంధనలను అమలు చేయాలని అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు, విద్యావంతులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత మరియు అందరూ ద్విచక్ర వాహనదారులు అనగా వాహనం నడుపుచున్నావారు మరియు వెనుక కూర్చొని వున్నవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపినారు
Post a Comment