మీ అందరి ఆశీస్సులతోటి , భగవంతుని ఆశీస్సులతోటి నా బైపాస్ సర్జరీ విజయవంతమై

 


అందరికి నమస్కారం

ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులతోటి , భగవంతుని ఆశీస్సులతోటి నా బైపాస్ సర్జరీ విజయవంతమై కొలుకుంటూ ఉన్నాను. కాకపోతే మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఈ సందేశాన్ని పంపుతున్నాను..

ముఖ్యంగా కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలోని రుద్రుకోట , అనేమడుగు , సర్వాయపాలెం , చెన్నాయపాలెం , పెద్ద పట్టపు పాలెం , తుమ్మలపెంట గ్రామాలకు సంబందించిన ఆ ప్రజలకు సంబంధించిన భూములన్ని ఈరోజు ప్రభుత్వం  ఫైనల్ మీటింగ్ పెట్టాబోతున్నారని నాకు తెలియటం జరిగింది. ఎందుకంటే గతములో వైస్సార్సీపీ అధికారంలో ఉండగా.. వాళ్లకోసం 30 నుండి 40 లక్షలు నేను తెప్పించాలని చేసిన ప్రయత్నం  అందరికి తెలిసిందే  కాకపోతే ఎన్నికల సమయంలో ఇప్పటి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి గారు ఆరోజు ఎదో నేను కమిషన్లకు కకృతి పడుతున్నాను , ప్రతాప్ రెడ్డి మాటలను నామ్మవద్దు 35 లక్షలు ఇప్పిస్తానని అంటున్నాడు.. నేను 50 లక్షలు ఇప్పించడమే కాకుండా భూమి కోల్పోయిన కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కూడా కలెక్టర్ చేత ఆ కంపెనీలో శాశ్వతంగా ఉండే విధంగా రాపిచి ఇప్పిస్తానని చెప్పడం మనందరికి తెలిసిందే.  దీని గురించి నేను కూడా గతంలో మాట్లాడటం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు నా మీద ఆబండాలు వేయడమే కాకుండా.. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కి కూడా పంపుతాను ప్రతాప్ రెడ్డి గారికి మెంటల్ వచ్చింది అని చెప్పడం జరిగింది. అయిన కూడా వాటిని పట్టించుకోదలుచుకోలేదు.

ఎందుకంటే నాకు ముఖ్యం నా తీర ప్రాంత గ్రామ ప్రజలు, మత్స్యకార ప్రజలు అందుకే ఈరోజు చివరి నిర్ణయం తీసుకోబోతున్నారని కలెక్టర్ గారు కావచ్చు ..ఇతర అధికారులు కావచ్చు వారం దరు కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు.. 

కాకపోతే  ఎవరైతే ప్రజలు దానిని ప్రశ్నిస్తారో.. దాని వ్యతిరేకిస్తారో.. వాళ్ళ గొంతు నులిమే దానికి వాలని అరెస్ట్ చేస్తామని , జైల్లో పెడతామని , కేసులు పెడతామని భయబ్రాంతులకు గురి చేయడం ఈరోజు నా దృష్టికి వచ్చింది. కాబట్టి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎప్పుడూ కూడా ప్రజల తరపున మాట్లాడుతాం.. మా తీర ప్రాంత మత్స్యకారుల కోసం , మా తీర ప్రాంత ప్రజల కోసం , కావలి నియోజకవర్గ ప్రజల కోసం పోరాడటమే మా ద్యేయం ఈరోజు మేమందరం అడిగేది మా తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన భూములకి గిట్టుబాటు ధర కల్పించమని.. అంతేకానీ ఇక్కడ ఇండస్ట్రీలు రాకూడదని మేము వ్యతిరేకం కాదని ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి చదువుకున్న విజ్ఞులు కూడా గుర్తు పెట్టుకోవాలి . 

అందుకే ఈరోజు  నాకు మాట్లాడేదానికి కష్టంగా ఉన్న కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను తీర ప్రాంత ప్రజల కోసం , తీర ప్రాంత గ్రామాల కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను.

ధన్యవాదాలు

ఇట్లు

మీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మాజీ శాసనసభ్యులు మరియు వైస్సార్సీపీ ఇంఛార్జి


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget