డివైడర్ ను డీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి
 డివైడర్ ను డీకొన్న బైక్ 
ఇద్దరు యువకులు  మృతి 
రాష్ట్ర సరిహద్దులో ప్రమాదం 
మృతులు కలువాయి వాసులు 
 తడ, రవి కిరణాలు, మార్చి 20:-
తడ మండలం లోని సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు వద్ద  బైక్ డివైడర్ ను ఢీకొన్న 
ప్రమాదం లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది,సోమవారం తెల్లవారుజామున  డైవర్షన్ కోసం జాతీయ రహదారి పై ఏర్పాటు చేసి ఉన్న డివైడర్ గోడను   ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది, మృతులు  కలువాయి మండలం నూకనపల్లి గ్రామానికి చెందిన దండు వెంకటరమణ, యలకచేర్ల అరుణ్ గా తడ పోలీసులు గుర్తించారు,చెన్నైలో మొబైల్ దుకాణంలో కొనుగోళ్ళకు వెళ్తున్న సమయం లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది , ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం తో నూకనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి  తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
