తిరుపతి జిల్లా  నాయుడుపేట

నాయుడుపేటలో వైయస్సార్ చేయూత మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం

 నాయుడుపేట పట్టణంలోని కేకే కళ్యాణ్ సదన్ లో పట్టణ మరియు రూరల్  ప్రాంతాలకు సంబంధించి వైయస్సార్ చేయూత మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మరియు టిటిడి బోర్డు మెంబర్ కిలివేటి సంజీవయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పెద్దపీట వేస్తున్నారన్నారు, మహిళలు ఆర్థికంగా బలపడడానికి వైయస్సార్ ఆసరా వైయస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న తోడు, బ్యాంకు లింకేజీ రుణాలు, వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని అన్నారు. మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు, అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేంద్ర, ఎంపీడీవో శివయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, చైర్ పర్సన్ కటకం దీపిక, జెడ్ పి టి సి కట్ట  జ్యోతి, ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, కామిరెడ్డి రాజారెడ్డి,వైసిపి పట్టణ అధ్యక్షులు 786 రఫీ, కట్టా రమణారెడ్డి, కలికి మాధవరెడ్డి, చదలవాడ కుమార్, కటకం జయరామయ్య, ఏఎంసీ చైర్మన్ ఒత్తూరు కిషోర్ యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,