కర్నూల్ ఉల్లిపాయ కూరల రుచి, సువాసన అదరహో అంటూ రైతుల పక్షాన కలెక్టర్ నాగరాణి భరోసా
కర్నూల్ ఉల్లిపాయ కూరల రుచి, సువాసన అదరహో అంటూ రైతుల పక్షాన కలెక్టర్ నాగరాణి భరోసా
రైతుల నుంచే కొనుగోళ్లు పెంచాలని వ్యాపారులకు ఆదేశాలు
పశ్చిమ గోదావరి, రవికిరణాలు సెప్టెంబర్ 11 :
తాడేపల్లిగూడెం ఉల్లిపాయ మార్కెట్‌లో ఈ రోజు కర్నూల్ ఉల్లిపాయలతో చేసిన కూర రుచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా రైతులు, హమాలీలు, వ్యాపారులు, అధికారులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొని విభిన్న ఉల్లిపాయ వంటకాలను ఆస్వాదించారు. “ఈ ఉల్లిపాయలు వినియోగించిన అన్ని వంటకాలు రుచికరంగా ఉన్నాయి” అని ప్రశంసిస్తూ, కర్నూల్ ఉల్లిపాయలకు మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
తొలుత కలెక్టర్ నాగరాణి మార్కెట్ యార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు–కమిషన్ ఏజెంట్లు రైతుల వద్ద నుంచే నేరుగా కొనుగోళ్లు పెంచాలని, వారికి తగిన ధర అందేలా చర్యలు తీసుకోవాలని గట్టి ఆదేశాలు జారీ చేశారు. రైతు సంక్షేమంపై జిల్లా పరిపాలన నిఘా ఉంచుతుందని ఆమె స్పష్టం చేశారు. కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు రైతులకు ధైర్యం కలిగించగా, మరోవైపు కర్నూల్ ఉల్లిపాయలకు ప్రోత్సాహక వాతావరణం సృష్టించారు.

.jpg)
