నెల్లూరు జిల్లా

జిల్లా లో జరిగిన పలు నేరాలు ఛేదించిన పోలీసులు...వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల





కొడవలూరు మండలం కొత్త వంగల్లు గ్రామం లో వృద్ధ మహిళ హత్య కేసు ఛేదించిన కొడవలూరు పోలీసులు...నిందితుడు అదే గ్రామానికి చెందిన యువకుడు  నెల్లూరు నగరం రంగ నాయకులు పేట రైల్వే గేటు రైల్వే స్టేషన్ రోడ్డు సమీపం లో కర్ణాటక వ్యక్తి హత్య కేసు ఛేదించిన సంతపేట పోలీసులు

14.03.2024 న 5th టవున్ పరిధిలో పొదలకూరు రోడ్ లో అరవభూమి సుజన్ కృష్ణా రెడ్డి@చింటు  అనే(28) యువకుని హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న 6 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన 5th టవున్ పోలీసులు...2024 లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ముద్దాయిలు ఇన్ని రోజుల తర్వాత కటకటాలుకు పంపిన పోలీసులు,ఈ కేసులో రాజకీయ అండదండలు ఓ ప్రజా ప్రతినిధి అండతో అప్పట్లో నేరస్థులు స్వేచ్ఛగా తిరిగారని ఇన్నాళ్ళకు నెల్లూరుకు పట్టిన నేర గ్రహణం వీడిందని జిల్లా ఎస్పీ అజిత దూకుడు తో పోలీసులు స్వేచ్ఛగా నేరగాళ్ల భరతం పడుతున్నారని జిల్లా లో శాంతి భద్రతలు కుదుట పడుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు