నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గురువారం స్థానిక 44 వ డివిజన్ ఆచారివీధి వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించారు.
కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ వాసుబాబు లు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్ విధి దీపాల ఏర్పాటు, డ్రైను కాలువల నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన పెన్షన్లు, ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు. అయితే నూతన పెన్షన్లు, ఖాళీ స్థలాల మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందుకున్న వినతులను అత్యంత పారదర్శకంగా, నిర్దేశించిన సమయంలోపుగా పూర్తి చేసేందుకు స్వయంగా మంత్రి నారాయణే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ల ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరికృష్ణ, సత్య నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.